'జబర్దస్త్' ప్రోగ్రామ్ చూసేవాళ్లకు రీతూ చౌదరి తెలుసు. ఆమె సీరియల్స్ కూడా చేస్తున్నారు. స్కిట్స్‌లో అజర్ పెయిర్‌గా చేసినా... రీతూ చౌదరి రియల్ లైఫ్ లవర్ వేరే ఉన్నారని తెలుస్తోంది. రీసెంట్‌గా రీతూ చౌదరి గోవా వెళ్లారు. అక్కడి నుంచి వీడియోస్ పోస్ట్ చేశారు. గోవాలో శ్రీకాంత్ అనే యువకుడితో తీసుకున్న వీడియోస్‌ను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రీతూ చౌదరి పోస్ట్ చేశారు. 'నా జీవితంలో నువ్వు ఉండటం సంతోషంగా ఉంది'' అని శ్రీకాంత్ గురించి రీతూ చౌదరి పోస్ట్ చేశారు. శ్రీకాంత్ కొన్ని ఫోటోలు తీసినట్టు పేర్కొన్నారు. రీతూ చౌదరి గోవా ట్రిప్ కారణంగా ఆమె రియల్ లైఫ్ బాయ్ ఫ్రెండ్ గురించి తెలిసిందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. శ్రీకాంత్‌తో రీతూ చౌదరి రీతూ చౌదరి లేటెస్ట్ ఫోటోలు