మటన్ నిల్వ పచ్చడి సింపుల్ రెసిపీ



బోన్‌లెస్ మటన్ - అరకిలో
కారం - పావు కప్పు
అల్లం వెల్లుల్లి పేస్టు - 5 స్పూనులు
నూనె - పావు లీటరు
ఉప్పు - రుచికి సరిపడా
నిమ్మరసం - 5 స్పూనులు
గరం మసాలా - ఒక స్పూను

మటన్ ముక్కలు శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి.



కళాయిలో నూనె, మటన్ ముక్కలు వేసి చిన్న మంట మీద వేయించాలి.

మటన్ ముక్కలు ఉడికాయని నిర్ధారించుకున్నాక వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.

కళాయిలో ఉన్న మిగిలిన నూనెలో అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి.

అల్లం వెల్లుల్లి ముద్ద వేగాక కారం, కాస్త గరం మసాలా, ఉప్పు వేసి వేయించాలి.

అన్నీ వేగాక స్టవ్ కట్టేసి మటన్ ముక్కలు అందులో వేసి కలపాలి.

మిశ్రమం చల్లారాక నిమ్మరసం కలపాలి. అంతే మటన్ పచ్చడి రెడీ అయినట్టే. తీసి గాలి చొరబడని సీసాలో దాచుకోవడమే.