బాలీవుడ్‌లో రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా జోడికి మంచి క్రేజ్ ఉంది. వీరు ఇప్పుడు మరాఠీలో ‘వేద్’ అనే సినిమా చేస్తున్నారు. తెలుగులో సూపర్ హిట్ అయిన ‘మజిలీ’కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో నాగచైతన్య పాత్రను రితేష్, సమంత పాత్రను జెనీలియా పోషిస్తున్నారు. ఈ సినిమాకు రితేష్ దేశ్‌ముఖ్‌నే దర్శకుడు కూడా. దర్శకుడిగా రితేష్‌కు ఇదే మొదటి సినిమా. ఈ సినిమా ట్రైలర్ కూడా ఇటీవలే విడుదల అయింది. సమంత, నాగచైతన్యల మ్యాజిక్‌ను వీరు క్రియేట్ చేశారా, లేదా అన్నది సినిమాలో చూడాల్సిందే. డిసెంబర్ 30న ఈ సినిమా విడుదల కానుంది. తెలుగు ‘మజిలీ’ కమర్షియల్‌గా కూడా పెద్ద సక్సెస్ అయింది.