ప్రస్తుతం మనదేశంలో అత్యంత వివాదాస్పదం అయింది ‘బేషరం రంగ్’ సాంగ్. దీంతో #BoycottPathaan సాంగ్ ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటుంది. ఈ సినిమాకు యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. షారుక్‌కు జోడిగా దీపిక పదుకోన్ ఈ సినిమాలో నటిస్తుంది. ప్రతినాయకుడి పాత్రలో జాన్ అబ్రహాం నటిస్తున్నాడు. జనవరి 25వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో కూడా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇందులో సల్మాన్ ఖాన్ కూడా అతిథి పాత్రలో కనిపించనున్నాడు. యష్ రాజ్ స్పై మల్టీవర్స్‌లో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.