రిషభ్‌ పంత్‌ నేడు 25వ వసంతంలోకి అడుగెట్టాడు.

ట్రిపుల్‌ సెంచరీ చేసిన థర్డ్‌ యంగెస్ట్‌ ఇండియన్‌ ప్లేయర్‌.

2016 U-19 ప్రపంచకప్‌లో నేపాల్‌పై 18 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేశాడు.

కెరీర్‌ ఆరంభం నుంచీ దిల్లీ క్యాపిటల్స్‌కే ఆడుతున్నాడు. ఇప్పుడు కెప్టెన్‌.

2018లో SRHపై 63 బంతుల్లో 128 కొట్టాడు. ఐపీఎల్‌లో ఓ భారత ప్లేయర్‌ అత్యధిక స్కోరిదే.

టెస్టు, వన్డేల్లో సెంచరీలు కొట్టిన పంత్‌ టీ20ల్లో ఇంకా ఈ ఫీట్‌ అందుకోలేదు.

ఒక టెస్టు మ్యాచులో ఎక్కువ క్యాచులు పట్టింది పంతే. 2018లో ఆసీస్‌పై 11 అందుకున్నాడు.

2018లో ఐసీసీ మెన్స్‌ ఎమర్జింగ్‌ క్రికెటర్‌ ఆఫ్ ది ఇయర్‌ అందుకున్నాడు.

కేఎల్‌ రాహుల్‌ గాయంతో 2022, జూన్‌లో టీమ్‌ఇండియాకు కెప్టెన్సీ చేశాడు.

ఈ టీ20 ప్రపంచకప్‌లో పంత్‌ రాణించాలని అంతా కోరుకుంటున్నారు.