హైదరాబాద్‌లో పరుగులు వరద పారింది! సిక్సర్ల మోత మోగింది. ఉప్పల్‌లో రాత్రిపూట సూర్యోదయం చోటు చేసుకుంది! సిరీస్ డిసైడర్‌లో భారత్ అద్భుత విజయం అందుకుంది. మూడో టీ20లో 6 వికెట్ల తేడాతో గెలుపు బావుటా ఎగరేసింది. 187 పరుగుల టార్గెట్ను మరో బంతి మిగిలుండగానే ఛేదించేసింది. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ (69; 36 బంతుల్లో 5x4, 5x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఛేదన రారాజు విరాట్ కోహ్లీ (63; 48 బంతుల్లో 3x4, 4x6) సొగసైన షాట్లతో మురిపించాడు. ఆసీస్‌లో కామెరాన్ గ్రీన్ (52; 21 బంతుల్లో 7x4, 3x6) అదరగొట్టాడు. టిమ్ డేవిడ్ (54; 27 బంతుల్లో 2x4, 4x6) హాఫ్ సెంచరీ చేశాడు. అక్షర్ పటేల్ (3-33) బౌలింగ్‌లో అదరగొట్టాడు.