మొహాలిలో టీమ్‌ఇండియాకు ఓటమి ఎదురైంది! అచొచ్చిన మైదానంలో క్యాచ్‌డ్రాప్‌లు హిట్‌మ్యాన్ సేన కొంప ముంచాయి. గెలవాల్సిన మ్యాచును చేజేతులా నేలపాలు చేశాయి. ఫీల్డింగ్‌లో టీమ్ఇండియా వైఫల్యంతో ఆసీస్ 209 టార్గెట్‌ను ఛేదించేసింది. కామెరాన్ గ్రీన్ (61; 30 బంతుల్లో 8x4, 4x6) ఓపెనింగ్‌లో అదరగొట్టాడు. ఆఖర్లో మాథ్యూవేడ్ (61; 30 బంతుల్లో 8x4, 4x6) భారీ సిక్సర్లతో గెలిపించాడు. కేఎల్ రాహుల్ (55; 35 బంతుల్లో 4x4, 3x6) ఫామ్ లోకి వచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ (46; 25 బంతుల్లో 2x4, 4x6) మెరిశాడు. హార్దిక్ పాండ్య (71*; 30 బంతుల్లో 7x4, 5x6) గ్రేట్ ఫినిషింగ్ ఇచ్చాడు. అక్షర్ పటేల్ 3, ఉమేశ్ 2 వికెట్లు పడగొట్టారు.