రాబిన్‌ ఉతప్ప అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు.

రెండు దశాబ్దాల క్రికెట్ జర్నీకి గుడ్ బై చెప్పేశాడు.

20 ఏళ్లుగా జాతీయ, దేశవాళీ, ఐపీఎల్ క్రికెట్ ఆడినందుకు సంతోషం.

ఓ మనిషిగా ఎదగడంలో ఈ ఆట నాకు సాయం చేసింది.

ఇకపై కుటుంబంతో సమయం గడుపుతూ కొత్త అధ్యాయం ఆరంభిస్తా.

అండగా నిలిచిన బీసీసీఐ కర్ణాటక, సౌరాష్ట్ర, కేరళ క్రికెట్‌ సంఘాలకూ కృతజ్ఞతలు చెప్పాడు.

ఐపీఎల్‌లో మధురమైన జ్ఞాపకాలు ఇచ్చిన కేకేఆర్‌, సీఎస్కేకు రుణపడి ఉంటా అన్నాడు.

తనకెంతో ఇష్టమైన టీ20 ప్రపంచకప్ చిత్రం పెట్టి వీడ్కోలు పలికాడు.

ఇకపై ఉతప్ప కామెంటరీ, విదేశీ లీగుల్లో ఆడొచ్చు.

ఉతప్ప ఫామ్లో ఉంటే ప్రత్యర్థి వణికిపోయే సంగతి తెలిసిందే.