టాప్‌ షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ ఓ ఇంటివాడయ్యాడు.

శ్వేత రేచల్‌ థామస్‌ను బుధవారం పెళ్లి చేసుకున్నాడు.

అత్యంత సింపుల్‌గా త్రివేండ్రంలో వీరి పెళ్లి జరిగింది.

కువైట్‌లో పుట్టిన రేచల్‌ ఇండియాలో ఉద్యోగం చేస్తోంది.

బెంగళూరులో ఫ్యాషన్‌ కంటెంట్‌ క్రియేటర్‌గా పనిచేస్తోంది.

కొన్నేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు.

రిజిస్టర్‌ మ్యారేజ్‌ అయ్యాక 'జస్ట్‌ మ్యారీడ్‌' అంటూ ప్రణయ్‌ ఫొటోలు పెట్టాడు.

3 రోజులు ముందే ప్రీ వెడ్డింగ్‌ ఫొటోస్‌ షేర్‌ చేశాడు.

మంగళవారం ప్రణయ్ ర్యాంకు మరింత మెరుగైంది.

ప్రపంచ 16వ ర్యాంకుకు ప్రణయ్ చేరుకున్నాడు.