'ఎస్ఎంఎస్' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రెజీనా కసాండ్రా.



ఆ తరువాత 'రొటీన్ లవ్ స్టోరీ', 'కొత్త జంట' వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. 



'పిల్లా నువ్వు లేని జీవితం', 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' లాంటి సినిమాలు రెజీనా క్రేజ్ ని పెంచాయి.



తెలుగులో ఆమె చివరిగా 'ఎవరు' అనే సినిమాలో నటించింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. 



ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అరడజనుకి పైగా సినిమాలు ఉన్నాయి. అందులో రెండు, మూడు తెలుగు సినిమాలు ఉన్నాయి. 



'ఆచార్య' సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించనుంది రెజీనా.



ఈరోజు రెజీనా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుంది. 



ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆమెకి శుభాకాంక్షలు చెబుతున్నారు. 



పలువురు సెలబ్రిటీలు సైతం రెజీనా విష్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. 



ఇలాంటి పుట్టినరోజులు ఆమె మరిన్ని సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుందాం.