పాయల్ రాజ్‌పుత్ పంజాబ్ కుటుంబంలో పుట్టింది. ఢిల్లిలో పెరిగింది. పాయల్ తల్లిదండ్రులు టీచర్లు. పాయల్‌కు నాలుగేళ్ల వయస్సు ఉన్నప్పుడే సీరియల్స్‌లో బాలనటిగా నటించింది. జర్నలిజంలో డిగ్రీ పూర్తయ్యాక టీవీ చానల్ యాంకర్‌గా మారింది. తర్వాత మోడలింగ్ చేసింది. సినిమాల్లో అవకాశాల కోసం రూ.లక్ష పట్టుకుని ఆమె ముంబయి వచ్చింది. తెలుగు, తమిళ చిత్రాల్లో అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైంది. 2010లో ‘సప్నోన్ సే బరే నైనా’ సీరియల్‌లో సోనాక్షి పాత్రతో పరిచయమైంది. ‘గుస్తాక్ దిల్’, ‘మహా కుంభ్’, ‘ఆఖిర్ బాహు భీ తోహ్ బేటీ హీ హై’ తదితర సీరియల్స్‌లో ప్రధాన పాత్ర పోషించింది. 2017లో ‘చన్నా మేరేయా’ అనే పంజాబీ చిత్రంతో తొలిసారి బిగ్ స్క్రీన్‌పై కనిపించింది. 2018లో అజయ్ భూపతి దర్శకత్వంలో ‘RX 100’ సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ‘RX 100’ తర్వాత వరుస ఆఫర్లు వచ్చాయి. ‘వెంకీ మామా’, ‘డిస్కో రాజా’, ‘RDX లవ్’, ‘అనగనగా ఓ అతిథి’ చిత్రాల్లో నటించింది. కానీ, ఆమెను లక్ వరించలేదు. ప్రస్తుతం ఆమె నటించిన ‘3 రోజెస్’ ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. ఇటీవల ఆమె ఫొటోషూట్‌కు చెందిన ఓ వివాదాస్పద వీడియో ద్వారా మళ్లీ ఆమె వార్తల్లోకి వచ్చింది. All Images Credit: Payal Rajput & Social Media