ఒమిక్రాన్ ఇండియాలోకి వచ్చేసింది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదవుతున్నాయి. కాబట్టి.. ఈ లక్షణాలు మీలో కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి.
డెల్టా కంటే వేగంగా..: ఇటీవల ఇండియాను భయపెట్టిన డెల్టా వేరియెంట్ కంటే ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాపిస్తోంది.
గత వేరియెంట్లు కంటే అత్యధిక మ్యూటేషన్స్ ఒమిక్రాన్ వేరియెంట్‌లో ఉన్నాయి.
ఇమ్యునిటీని అందించే వ్యాక్సిన్‌లను సైతం ఒమిక్రాన్ ఎదిరించగలదని నిపుణులు చెబుతున్నారు.
డెల్టా వేరియెంట్‌తో పోల్చితే.. ఒమిక్రాన్ లక్షణాల్లో కూడా చాలా తేడా ఉంది.
1. ఒమిక్రాన్ సోకితే తీవ్రమైన అలసటకు గురవ్వుతారు. శక్తి కోల్పోయినట్లు అనిపిస్తుంది.
2. గొంతు గరగరా అనిపిస్తుంది. కొందరికి గొంతు నొప్పి కూడా వస్తుందని తెలిసింది.
3. డెల్టాతో పోల్చితే.. ఒమిక్రాన్ సోకినవారికి చాలా తక్కువ జ్వరం వస్తుంది. బాడీ టెంపరేచర్ తక్కువగా ఉంటుంది.
4. రాత్రి పూట చెమటలు పడతాయి. ఒళ్లు నొప్పులు ఎక్కువగా ఉంటాయి.
5. పొడి దగ్గు ఎక్కువగా ఉంటుంది. గొంతులో ఇరిటేషన్ కలిగినప్పుడే ఇలాంటి దగ్గు వస్తుంది.
ప్రస్తుతం ఇండియాలో డెల్టా వేరియెంట్ ఇంకా ఉనికిలో ఉంది.
మీరు వాసన, రుచి కోల్పోయి, తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నట్లే తప్పకుండా కరోనా వైరస్ టెస్ట్ చేయించుకోవాలి. ఒమిక్రాన్‌తో పోల్చితే.. డెల్టా వేరియెంట్ చాలా డేంజర్.