ఇటీవలి కాలంలో బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించిన సినిమా కాంతార.

కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కూడా ఈ సినిమాను ఆకాశానికి ఎత్తేశారు.

కన్నడలో మొదట విడుదల అయిన ఈ సినిమా తర్వాత అన్ని భాషల్లోకి డబ్ అయింది.

ఈ సినిమాకు దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టినే ఇందులో హీరోగా కూడా నటించారు.

ప్రస్తుతం ఐఎండీబీలో ఈ సినిమాకు 9.2 రేటింగ్ ఉంది.

హిందీలో దీపావళికి విడుదల అయిన థ్యాంక్ గాడ్, రామ్ సేతులకు కాంతార గట్టిపోటి ఇస్తుంది.

తెలుగులో కూడా ప్రిన్స్, సర్దార్, ఓరి దేవుడాల కంటే కాంతార ఎక్కువ వసూళ్లను రాబడుతోంది.

కర్ణాటకలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా కాంతార నిలిచింది.

హిందీలో ఈ సినిమా ఇప్పటివరకు రూ.42.95 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది.

ఇక తెలుగులో రూ.38 కోట్ల గ్రాస్, రూ.20.94 కోట్ల షేర్ వసూలు చేసి ఇప్పటికీ దూసుకుపోతుంది.