‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా. గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. ఇటీవలే మరోసారి గోపిచంద్ తో కలిసి పక్కా కమర్షియల్ సినిమాలో కనిపించింది. వరుస ఫ్లాపుల మధ్యలో ఇటీవలే ఆమె ఫర్జ్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. తాజాగా ఓ బ్యూటీఫుల్ వీడియో షేర్ చేసిన ముద్దుగుమ్మ. ఓ షాపింగ్ మాల్ ఓపెన చేసిన రాశీ.. పట్టు చీరలో అందర్నీ తన వైపుకు తిప్పుకుంది. అందంగా డ్రెస్ అయ్యి ఫ్యాన్స్ మదిని దోచేసింది. ఫ్యాన్స్ చూపించిన అభిమానానికి పొంగిపోయి, ఒకింత ఆశ్చర్యపోయింది కూడా. వారితో సెల్ఫీ దిగుతూ ఎంజాయ్ చేసింది. Image Credits : Rashi Kanna/Instagram