రణ్‌బీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతోంది.

ఇందులో రణ్‌బీర్ కపూర్ తన లుక్‌తో అందరికీ షాకిచ్చాడు.

ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్ కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు.

రణ్‌బీర్ పోలీస్ గెటప్‌లో ఉన్న ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఈ ఫొటొల్లో రణ్‌బీర్ ‘చిన్‌గం’ అనే పోలీసుగా కనిపించారు.

కేవలం యూనిఫాం మాత్రమే కాకుండా రణ్‌బీర్ పెద్ద మీసాలతో కనిపించారు.

రోహిత్ శెట్టి, రణ్‌బీర్ ఒక యాడ్ కోసం కలిసి పని చేశారు.

సింగం సిరీస్, కాప్ వర్స్ వంటి కమర్షియల్ సినిమాలతో రోహిత్ శెట్టి బాలీవుడ్‌లో బెంచ్ మార్క్ సెట్ చేశారు.

ఈ లుక్ మొదట బయటకు వచ్చినప్పుడు రణ్‌బీర్ కూడా కాప్ వర్స్‌లోకి వచ్చారని ఫ్యాన్స్ అనుకున్నారు.

రణ్‌బీర్, సందీప్ కలిసి ‘యానిమల్ పార్క్’ కూడా త్వరలో చేయనున్నారు.