బ్లూ డ్రస్సులో మెరిసిపోతున్న ఫొటోలను రకుల్ ప్రీత్ ఇన్‌స్టాలో షేర్ చేసింది. 'కెరటం' సినిమాతో రకుల్ ప్రీత్ సింగ్ సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. రీసెంట్ గా రెండు హిందీ సినిమాలకు రకుల్ ప్రీత్ సింగ్ సైన్ చేసింది. ప్రస్తుతం వీటికి సంబంధించిన షూటింగుల్లో పాల్గొంటోంది. రకుల్ ప్రీత్ నటించిన ‘బూ’, ‘ఐ లవ్యూ’ సినిమాలు జియో సినిమాలో విడుదల అయ్యాయి. వీటిలో ‘బూ’ హర్రర్ థ్రిల్లర్ కాగా, ‘ఐ లవ్యూ’ సినిమా రొమాంటిక్ థ్రిల్లర్. ఈ రెండు సినిమాలూ నెల రోజుల వ్యవధిలోనే ఓటీటీలోకి వచ్చాయి.