టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయింది రకుల్ ప్రీత్ సింగ్.
కానీ ఈ మధ్యకాలంలో ఆమెకి అవకాశాలు తగ్గాయి.
తెలుగులో చివరిగా 'కొండపొలం' అనే సినిమాలో కనిపించింది.
తెలుగులో అవకాశాలు లేనప్పటికీ బాలీవుడ్ లో బిజీ అయింది.
దాదాపు అరడజనుకి పైగా సినిమాల్లో నటిస్తోంది.
రీసెంట్ గా ఆమె నటించిన 'ఎటాక్' సినిమా ఫ్లాప్ అయింది.
ఇప్పుడు 'రన్ వే 34' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది.
గ్యాప్ లేకుండా ఫొటోషూట్స్ లో పాల్గొంటూ వాటిని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది.
ఈ సినిమాతో అయినా సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి!