రక్ష అంటే రక్షణ, బంధన్ అంటే సంబంధం..అందుకే ఈ పండుగకు రక్షా బంధన్ అని పేరు వచ్చింది. దరి తన సోదరుని చేతికి రాఖీ (పవిత్రమైన దారం) కట్టేటప్పుడు... దీర్ఘాయువు, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తుంది.
సోదరుడి నుదిటిపై తిలకం దిద్ది రాఖీ కట్టి స్వీట్ తినిపించి ఆ తర్వాత హారతిస్తుంది. ఆమెకు జీవితాంతం అండగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తాడు సోదరుడు.
రాఖీ కుడిచేతికే ఎందుకు కడతారు, ఎడమ చేతికి కట్టొచ్చు కదా అనే సందేహం కొందరికి ఉంటుంది. అసలు కారణం ఏంటంటే...
భారతీయులు ఎక్కువగా ఎడమచేతిని శుభ్రపరిచే ప్రయోజనాల కోసం వినియోగిస్తారు. అందుకే కుడిచేతికి రాఖీ కట్టాలని చెబుతారు.
హిందువులు చెప్పుకునే సవ్య, అపసవ్య దిశల ప్రకారం..సవ్యదిశ విశ్వాసానికి అనుగుణంగా ఉంటుంది. అపసవ్య దిశను నెగిటివ్ ఎనర్జీగా భావిస్తారు. దీనిద్వారా శారీక రుగ్మతలు వస్తాయని విశ్వసిస్తారు.
పురాతన తమిళ సాహిత్యం కూడా ఇందుకు ఓ కారణం చెబుతుంది. పలులు సాధారణంగా ఎడమ వైపు కాకుండా కుడి వైపున పడే వేటను మాత్రమే తింటాయి. తమిళ సంస్కృతిలో, కుడివైపు ఎడమ కంటే ఎక్కువ బరువు ఉంటుంది.
చాలా సంస్కృతులు, భాషల్లో..కుడిని అదృష్టంగా ,ఎడమను దైవదూషణగా చెబుతారు.
ఆయుర్వేద శాస్త్రం ప్రకారం కుడిచేతికి బంధనం కట్టడం ద్వారా వాత, పిత్త, కఫం నియంత్రణలో ఉంటాయని చెబుతారు. సోదరి రాఖీ కట్టినప్పుడు ఈ మూడు శరీర అంశాలు క్రమబద్ధీకరించి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
నాడి శాస్త్రం ప్రకారం మానవ శరీరంలో ఇడా, పింగళ, సుషుమ్న అనే మూడు నాడిలు ఉంటాయి. మూడింటిలో పింగళ నాడి కుడి వైపున నడుస్తుంది .. పురుషత్వంతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది తేజం, సమర్థత, బలాన్నిస్తుంది.
మగవారిలో పింగళనాడి చైతన్యవంతమైతే పురుషాధిక్యత ఎక్కువగా ఉంటుంది. అందుకే సోదరుడి కుడి చేతికి రాఖీ కట్టారు.