31-07-2022
రాశిఫలాలు



మేషం
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది.ప్రశాంతంగా ఉంటారు. మీ ప్రవర్తనతో అందర్నీ ఆకట్టుకుంటారు. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి.శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు తీరుతాయి. ఉద్యోగం, వ్యాపారంలో లాభపడతారు.



వృషభం
కొన్ని సమస్యల నుంచి ఈ రోజు మీకు ఉపశమనం లభిస్తుంది. ఓ పెద్ద పనిని పూర్తిచేస్తారు. ఇచ్చిన అప్పులు వసూలవుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. విద్యార్థులు చదువుపైనుంచి దృష్టి మరోవైపు మరలకుండా చూసుకోవాలి.



మిథునం
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలుంటాయి. ఆత్మవిశ్వాసం కోల్పోతారు. ఉద్యోగులు, వ్యాపారులకు అంత అనూకలంగా ఉండదు. కొన్ని పనుల్లో లాభం, మరికొన్ని పనుల్లో నష్టం రెండూ ఎదుర్కొంటారు. నూతన పెట్టుబడులు పెట్టొద్దు. విద్యార్థులకు సాధారణ రోజు అవుతుంది.



కర్కాటకం
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది.మీ పని రంగంలో విజయం సాధిస్తారు. తొందరపాటు నిర్ణయం వల్ల నష్టపోతారు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం ద్వారా వ్యాపారులు లాభపడతారు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు.



సింహం
ఈ రోజు అధిక శ్రమ వల్ల తొందరగా అలసిపోతారు. ఉద్యోగులు, వ్యాపారులు సరైన సమయానికి నిర్ణయం తీసుకోపోవడం వల్ల ఆర్థికంగా నష్టోతారు. లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు ఈ రోజు శుభప్రదం. స్నేహితులతో కలసి బయటకు వెళ్లే ప్లాన్ చేసుకుంటారు.



కన్య
ఈ రోజంతా గందరగోళంగా ఉంటారు. ఆఫీసు రాజకీయాల్లో ఇరుక్కోవడం వల్ల మీ ఇమేజ్ మసకబారుతుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు పెద్దగా మార్పులుండవు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు రావాలంటే మరింత కష్టపడాలి.



తులా
ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. సానుకూలంగా ఉంటారు. తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు. ఆర్థికంగా లాభపడే అవకాశాలున్నాయి. కష్టపడితేనే ఫలితం సాధిస్తారు. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. అన్నదమ్ములతో సరాదాగా గడుపుతారు.



వృశ్చికం
ఈ రోజు మీ రోజు సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. రోజంతా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. అనవసరంగా ఎవరితోనూ వివాదం పెట్టుకోవద్దు. కోపాన్ని అదుపుచేసుకోండి. కార్యాలయంలో కొన్ని రాజకీయాల్లో చిక్కుకుంటారు. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించండి.



ధనుస్సు
ఈ రోజు నిదానంగా ఉంటుంది. ఏదో అలసట, నీరసం అనిపిస్తుంది. కార్యాలయంలో ఏపని చేయాలని అనిపించదు. ఆర్థికంగా పెద్దగా తేడాలుండవు. రిస్క్ తీసుకోవద్దు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు మరింత కాన్సన్ ట్రేషన్ చేయాలి. మనసంతా గందరగోళంగా ఉంటుంది.



మకరం
ఈ రోజు మకర రాశివారికి మిశ్రమ ఫలితాలుంటాయి. వ్యక్తిగత జీవితం ప్రత్యేకంగా ఉంటుంది. వృత్తి జీవితంలో కొన్ని సమస్యలుంటాయి. ఆర్థిక ప్రణాళికలు నిలిచిపోతాయి. కార్యాలయంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొంటారు. విద్యార్థులు కష్టపడి పనిచేస్తేనే విజయం సాధిస్తారు.



కుంభం
ఈ రోజు మీకు శుభప్రదంగా ఉంటుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఏ ప్రణాళికలు వేసినా కార్యాలయంలో ఆర్థిక పురోగతికి అవకాశాలు ఉంటాయి. ఏ పని చేసినా సక్సెస్ అవుతారు. వ్యాపారులకు అనుకూలమైన సమయం. కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెట్టొచ్చు.



మీనం
ఈ రోజంతా ఎనర్జటిక్ గా ఉంటారు. ఉద్యోగం, వ్యాపారంపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారు. పెండిగ్ ఉన్న పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. లాభదాయనమైన అవకాశాలొస్తాయి. ఇప్పుడు పెట్టే పెట్టుబడులు రానున్న రోజుల్లో లాభాలనిస్తాయి.