ఈ నెలలో పుట్టినవారు అత్యంత విశ్వసనీయులు, మొండివాళ్లు



డిసెంబరులో జన్మించిన వ్యక్తులు చాలా నిజాయితీగా ఉంటారు. వీరికి సహనం చాలా తక్కువ, మాటపట్టింపు చాలా ఎక్కువ. కానీ కొన్ని పరిస్థితులకు తలవంచాలంటే బాధపడతారు. వ్యాపారాలు బాగా నిర్వహిస్తారు, స్వయంకృషిని నమ్ముకుంటారు



వీరిపై ఏదీ, ఎవరూ కూడా ఎలాంటి ప్రభావం చూపించలేరు. ఒకవేళ వారు ఏదైనా తప్పు చేసినా అది ఉద్దేశపూర్వకంగా జరిగినది కాదై ఉంటుంది.
వారి పనిని వారే స్వయంగా చేస్తారు, ఇతరులు చేస్తే వారికి నచ్చదు



డిసెంబరులో జన్మించిన వ్యక్తులు చాలా శక్తివంతంగా ఉంటారు, పనిపట్ల అంకిత భావంతో వ్యవహరిస్తారు. వీరికి మంచి నాయకత్వ లక్షణాలుంటాయి



వీరు చాలా తెలివైనవారు, ఏ విషయాన్ని అయినా లోతుగా అధ్యయనం చేసేందుకు ఇష్టపడతారు. కొత్త వ్యక్తులను కలుస్తారు, వివిధ సంస్కృతులను తెలుసుకుంటారు. బోధించేందుకు ఎంత ఉత్సాహంగా ఉంటారో..నేర్చుకోవడంలోనూ అంతకుమించి అనిపిస్తారు



కష్టాలు, సమస్యలను ఎదుర్కొంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వాటినుంచి దూరంగా పారిపోరు. జీవితం నుంచి ఏం కోరుకుంటున్నారో, ప్రాధాన్యతలేంటో తెలుసు. వీరికి ప్రత్యేకమైన కోరికలంటూ ఉండవు.



వీరు కొన్ని నియమాలకు,నమ్మకాలకు కట్టుబడి ఉండడం వల్ల దాన్నుచి వీరిని బయటకు తీసుకురావడం చాలా కష్టం. అందుకే అందరి దృష్టిలో మెండివాళ్లుగా పేరుపడతారు. కానీ ఆ మొండితనంలో కూడా ఎలాంటి స్వార్థ్యం ఉండదు



డిసెంబరులో జన్మించినవారు నిజాయితీగా, న్యాయంగా, విధేయులుగా ఉంటారు. మంచి విద్యావంతులు, దయగలవారు, బుద్ధిబలము, దైవభక్తి కలిగి ఉంటారు



వీరి ప్రవర్తన చాలా బావుంటుంది. బాగా చదువుకుంటారు, మంచి ఉద్యోగాలు చేస్తారు, బాగా సంపాదిస్తారు, మంచి పేరు సంపాదించుకుంటారు, నలుగురిలో గౌరవంగా బతుకుతారు. పట్టుదల ,కార్యదీక్ష కలిగి ఉంటారు, తలపెట్టిన పని పూర్తిచేస్తారు



వీరికి అదృష్టంతో పాటూ దైవసహాయం కూడా తోడుంటుంది, భక్తిమార్గాన్ని అవలంభిస్తారు, ధర్మకార్యాలు చేస్తారు, ప్రయాణాలమీద ఆసక్తి ఉంటుంది. మంచి ఉద్యోగాలు చేస్తారు, రాజకీయాల్లో రాణిస్తారు, వీరిలో కొందరు పండితులు, విద్యావంతులుగా ఉంటారు



చేసే పనిలో పూర్తిగా నిమగ్నమై ఉంటారు. పనిపై భక్తి, శ్రద్ధ రెండూ ఉంటాయి..ఆ పని పూర్తయ్యేవరకూ మరో పని గురించి ఆలోచించరు. ఏకాగ్రత ఎక్కువ, బుద్ధి చాలా చురుకుగా పనిచేస్తుంది, ఎలాంటి విషయాన్ని అయినా సులభంగా గ్రహించగలరు.



Note: ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి (images credit: pinterest)