నవంబరు నెలలో పుట్టినవారికి కోపం ఎక్కువ, తొందరపాటు ఎక్కువ, పట్టుదల-ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువే.
నవంబర్‌లో పుట్టిన వారు ఇతరుల కన్నా చాలా భిన్నంగా ఉంటారు. వీరి రూటే సెపరేట్, వారి ఆలోచనలు ప్రపంచానికి దూరంగా ఉంటాయి. చేసే ప్రతిపని ఓ నిర్దిష్ట పద్ధతిలో ఉండాలనుకుంటారు.
ఈ నెలలో జన్మించిన వ్యక్తులు అత్యంత విశ్వసనీయులు. స్నేహితులు, కుటుంబం, భాగస్వాములను ఎప్పుడూ నిరాశపర్చరు.
అందరి ముందూ మంచిగా మాట్లాడి వెనక్కు వెళ్లి మోసం చేసే టైప్ కాదు. వీరిలో అందం కన్నా ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. తమ చమత్కారంతో అందర్నీ ఆకట్టుకుంటారు.
అన్నీ తెలుసుకోవాలనే ఆసక్తి వల్ల వీళ్లెక్కడున్నా అన్నింటికీ ఏదో విధంగా కేంద్ర బిందువు అవుతారు
సాధారణంగా ఈ నెలలో పుట్టినవారు ప్రశాంతంగా ఉంటారు. పొరపాటున రెచ్చగొట్టారో అయిపోయారంతే. ఎప్పుడూ కోపంగా ఉండరు కానీ విరుచుకుపడితే మాత్రం తప్పించుకోలేరు. దానికి కూడా ఓ కారణం ఉండే ఉంటుంది.
వీరు ఉద్దేశ పూర్వకంగా ఎవ్వర్నీ బాధపెట్టరు కానీ వీరి మాటలు, చర్యలను ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకుంటారు. వీరిని అభిమానించేవారికి సహాయం చేసేందుకు ఎంత దూరమైనా వెళతారు
నవంబర్‌లో జన్మించిన వ్యక్తులు తరచుగా తమను తాము ఎలా భావిస్తున్నారో అంచనా వేసుకుంటుంటారు. స్నేహితుల విషయంలో కొన్ని రహస్యాలు మెంటైన్ చేసినప్పటికీ వారికోసం ముందుంటారు.
నిజాయితీ పరులు, పలుకుపడి సంపాదిస్తారు, గౌరవంగా బతుకుతారు, కీర్తిప్రతిష్టలు పెంచుకుంటారు. దేవుడిపై నమ్మకం ఉంటుంది. ఈ నెలలో పుట్టినవారికిశక్తి సామర్థ్యాలు, ఆకర్షణ శక్తి , తెలివితేటలు పవర్ ఉంటాయి.
ఈ నెలలో పుట్టినవారు చేసిన తప్పులవల్ల జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతరులను అభిమానించి మోసపోతారు. త్యాగబుద్ధి, సహాయం చేసే గుణం ఎక్కువ. ఆలోచించి నిర్ణయం తీసుకుంటే సక్సెస్ అవుతారు
Note: ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి (images credit: pinterest)