మేషం అతి కష్టమైన సమస్యలకు మీకు పరిష్కారం దొరుకుతుంది. వృత్తిపరంగా ఈరోజు మంచి రోజు అవుతుంది. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకుంటారు. పోటీపరీక్షలు రాసినవారు విజయం సాధిస్తారు.
వృషభం ఈ రోజు మీకు అకస్మాత్తుగా ధనలాభం ఉంటుంది. ఆర్థికంగా బలంగా ఉంటారు. అవసరం అయినవారికి సహాయం చేస్తారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. కొత్త స్నేహాలు ఏర్పడతాయి..రాబోయే రోజుల్లో ఇవి మీకు బాగా ఉపయోగపడతాయి.
మిథునం ఆర్థిక పరిస్థితి బావుంటుంది. చాలాకాలం పాటూ కొనసాగిన ఓ పని నుంచి ధనలాభం ఉంటుంది. ఆసక్తికర ఆలోచనలు, ప్రణాళికలు వేస్తారు. పెళ్లికానివారికి సంబంధాలు కుదురుతాయి. మీ తెలివితేటలతో అనుకున్న పనులు పూర్తిచేస్తారు.
కర్కాటకం ఈ రోజు వ్యాపారులు మంచి లాభాలు అందుకుంటారు. పాత పెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందుతారు. నచ్చిన ప్రదేశానికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.
సింహం ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతో గడిపేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఇంటి బాధ్యత పెరుగుతుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది.
కన్య వ్యాపారం పుంజుకునే ప్రణాళికలు వేసుకుంటారు. కొత్త ప్రయోగాలు చేయడంలో సక్సెస్ అవుతారు. ఈ రోజు మీకు ఏం చేసినా కలిసొస్తుంది...ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. జీవత భాగస్వామితో సమయం గడుపుతారు.
తుల ఈ రోజంతా తీరిక లేకుండా ఉంటారు. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి, అప్పగించిన పని పూర్తిచేస్తారు. వ్యాపారులు తమ లక్ష్యాలు చేరుకునేందుకు మరింత కష్టపడాలి.
వృశ్చికం భౌతిక ఆనందాలు పెరుగుతాయి. డబ్బు సంపాదించడానికి సత్వరమార్గాన్ని అవలంబిస్తారు. మీ జీవిత భాగస్వామిని సంతోషపెట్టేందుకు మంచి బహుమతులు ఇస్తారు. కుటుంబంలో అందరితో సత్సంబంధాలు మెండుగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు.
ధనుస్సు ఈ రోజు మీకు ప్రత్యేకమైన రోజు అనిపించే సంఘటనలు కొన్ని జరుగుతాయి. ఏదైనా క్లిష్టమైన సమస్యను పరిష్కరించడానికి రోజు మంచిది. మీ తెలివితేటలను సరిగ్గా ఉపయోగించండి. కార్యాలయంలో పరిచయస్తుల మద్దతు పొందుతారు.
మకరం ఈ రోజు మీకు మిశ్రమ రోజు అవుతుంది. మాట జాగ్రత్త.ఉద్యోగులు ఏం చేసినా కాస్త ఆలోచించండి. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. ఆదాయం స్థిరంగా ఉంటుంది కానీ ఖర్చులు కూడా సేమ్ టు సేమ్. కొన్ని ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు.
కుంభం తల్లిదండ్రుల దీవెనలు మీపై ఉంటాయి. తల్లిదండ్రుల సలహాలు పాటించడం ద్వారా మీకు మంచిజరుగుతుంది. సామాజికసేవ చేయాలనే ఆలోచన మీకు వస్తుంది. కార్యాలయంలో సహోద్యోగుల నుంచి కొన్ని సలహాలు పొందుతారు. మీ ప్రవర్తనతో అందర్నీ మెప్పిస్తారు.
మీనం ఈ రోజు మీరు చాలా సహనంగా పనిచేస్తారు. డబ్బు సంపాదన మార్గాలపై ఆలోచిస్తారు.స్తిరాస్తులనుంచి డబ్బులు వచ్చే అవకాశం ఉంది. కొత్తపని చేయాలని ఆలోచన ఉంటే ముందడుగు వేయండి. రోజువారీ పనులు పెరుగుతాయి.