నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడనం ప్రభావం అధికంగా ఉంటుంది.

ఏపీ, తెలంగాణ, యానాంలో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి

వర్షాల ప్రభావంతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, పార్వతీపురం మణ్యం, అనకాపల్లి జిల్లాల్లో నేడు మోస్తరు వర్షాలు

కాకినాడ, కొనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు

గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు జిల్లాలో మోస్తరు వానలు

కర్నూలు, నంద్యాల, కడప, చిత్తూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు

అక్టోబర్ 6 నుంచి 8 వరకు తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి

అక్టోబర్ 6 నుంచి పెద్దపల్లి, సిద్దిపేట, రంగారెడ్డి, నాగర్ కర్నూలు; ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వర్షాలు

హైదరాబాద్ ను మేఘాలు కమ్మేశాయి. రంగారెడ్డి జిల్లాతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో తేలికపాటి జల్లులు