నైరుతీ రుతుపవనాల తిరోగమనం ప్రభావంతో సీజన్ చివరిసారిగా భారీగా వర్షాలు కురవనున్నాయి.

అక్టోబర్ 1 వరకు ఏపీ, తెలంగాణ, యానాంలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి

ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ నుంచి 4.5 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది.

నేడు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ జారీ

రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పలు చోట్ల నేడు వర్షాలు కురవనున్నాయి

ఏపీలో మరో 4 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు కానుందన్న అమరావతి వాతావరణ కేంద్రం

శ్రీకాకుళం, పార్వతీపురం మణ్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు

కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో, యానాంలోనూ ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయి.

అక్టోబర్ 1 వరకు ఉమ్మడి గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు

కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం, తిరుపతి జిల్లాలతో పాటు అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ వానలు