ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో కాస్పర్ రూడ్‌పై 6-3, 6-3, 6-0 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించాడు. మ్యాచ్‌లో నాదల్ ధాటికి ఎక్కడా ఎదురు లేకుండా పోయింది. రెండు గంటల 18 నిమిషాల్లో ఈ మ్యాచ్ ముగిసింది. మొదటి సెట్‌ను నాదల్ 48 నిమిషాల్లో 6-3 తేడాతో గెలిచాడు. రెండో సెట్ 51 నిమిషాల్లోనే ముగిసింది. ఈ సెట్‌ను నాదల్ 6-3తో సొంతం చేసుకున్నాడు. మూడో సెట్ కేవలం 28 నిమిషాల్లోనే ముగిసిపోయింది. పూర్తిగా డామినేట్ చేసిన నాదల్ 6-0తో సెట్‌ను, మ్యాచ్‌ను, ఫ్రెంచ్ ఓపెన్‌ను కూడా గెలుచుకున్నాడు. కాస్పర్ రూడ్ మొదటి గ్రాండ్ స్లామ్ వెయిటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది.