ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్ రాయ్ లక్ష్మి షార్ట్ వేసి ఫొటోస్ దిగారు. అవి చూడకుండా ఉండగలరా? రాయ్ లక్ష్మి పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ సాంగ్స్ గుర్తు వస్తాయి. కథానాయికగా రాయ్ లక్ష్మి చేసిన సినిమాల కంటే ఐటెం సాంగ్స్ చేసిన సినిమాలు హిట్స్ కొట్టాయి. మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నంబర్ 150'లో 'రత్తాలు రత్తాలు' సాంగ్ సూపర్ హిట్. మాస్ మహారాజా రవితేజ 'బలుపు'లో అయితే రాయ్ లక్ష్మి పేరు మీద సాంగ్ రాశారు. లక్కీ రాయ్ అంటూ పవన్ కళ్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాలో కూడా 'తోబా తోబా...' పాటలో రాయ్ లక్ష్మి స్టెప్పులు వేశారు. హిందీలో ఇటీవల విడుదలైన అజయ్ దేవగణ్ 'భోళా'లో కూడా రాయ్ లక్ష్మి స్పెషల్ సాంగ్ చేశారు. ప్రస్తుతం మలయాళంలో 'డీఎన్ఏ' సినిమా చేస్తున్నారు రాయ్ లక్ష్మి సినిమాలు లేకపోయినా సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు అందుబాటులో ఉండటం రాయ్ లక్ష్మి స్పెషాలిటీ రాయ్ లక్ష్మి (All Images Courtesy : iamraailaxmi / Instagram)