'బాహుబలి' తర్వాత ప్రభాస్ మార్కెట్, స్టార్‌డమ్ పెరిగాయి. ఇప్పుడు ఆయన ఏయే సినిమాలు చేస్తున్నారో ఓ లుక్కేయండి. రామాయణం ఆధారంగా రూపొందిన 'ఆదిపురుష్'తో జనవరి 12న శ్రీరామునిగా ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 'ఆదిపురుష్' తర్వాత యాక్షన్ థ్రిల్లర్ 'సలార్'తో వచ్చే ఏడాది సెప్టెంబర్ 23న థియేటర్లలో సందడి చేయనున్నారు. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమా 'సలార్' కంటే ముందు వస్తుందా? తర్వాతా? అనేది త్వరలో తెలుస్తుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'ప్రాజెక్ట్ కె' కూడా ప్రభాస్ చేస్తున్నారు. 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా అంగీకరించారు. 'వార్' ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హాలీవుడ్ రేంజ్ సినిమా ప్లానింగ్ లో ఉంది. హిందీ దర్శకులు చాలా మంది ప్రభాస్‌తో సినిమాలు చేయాలని ఎదురు చూస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాణంలో ఓ సినిమా ప్రభాస్ చేయాల్సి ఉంది. ఆయన దగ్గర ఎప్పుడో అడ్వాన్స్ తీసుకున్నారు రాజమౌళితో ప్రభాస్ మరో సినిమా చేస్తే బావుంటుందని ఇరువురి అభిమానుల కోరిక.