టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న పూజాహెగ్డే. అయితే ఈ మధ్యకాలంలో సరైన హిట్టు ఒకటి కూడా పడలేదు. 'రాధేశ్యామ్', 'బీస్ట్' సినిమాలు ఆమెని నిరాశ పరిచాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన 'ఆచార్య' సినిమా కూడా బోల్తా కొట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో విజయ్ దేవరకొండ సరసన 'జనగణమన' సినిమా ఒప్పుకుంది. కానీ ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయిందని సమాచారం. బాలీవుడ్ లో అయితే సల్మాన్ ఖాన్ తో 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్', రణవీర్ సింగ్ తో 'సర్కస్' వంటి సినిమాలు చేస్తుంది. ఈ సినిమాలపై అమ్మడు చాలానే ఆశలు పెట్టుకుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇప్పుడు ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.