పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాను ఉద్యోగంతో సంబంధం లేకుండా ఎవరైనా తెరవొచ్చు. ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ రేటును అమలు చేస్తున్నారు.
పీపీఎఫ్ 'ఈఈఈ' కేటగిరీలోకి వస్తుంది. అంటే వడ్డీ సహా జమచేసే మొత్తంపై ఎలాంటి ఆదాయ పన్ను వర్తించదు. పీపీఎఫ్ లాకిన్ పిరియడ్ 15 ఏళ్లు.
ఈపీఎఫ్ (EPF)
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా తెరిచేందుకు ఉద్యోగులు మాత్రమే అర్హులు. సంఘటిత, అసంఘటిత రంగంతో సంబంధం లేదు.
ఉద్యోగి తన మూల వేతనంలో 12 శాతం జమ చేయాలి. దీనికి తోడుగా యజమాని కూడా మరో 12 శాతం జమ చేస్తారు. ప్రస్తుతం పీపీఎఫ్‌పై వార్షిక ప్రాతిపదికన 8.5 శాతం వడ్డీరేటు అమలు చేస్తున్నారు.
వీపీఎఫ్ (VPF)
ఈపీఎఫ్‌కు అదనంగా మరికొంత డబ్బు దాచుకోవాలంటే వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్‌ను ఎంచుకోవచ్చు. ఉద్యోగులకు మాత్రమే ఇందుకు అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈపీఎఫ్‌లో దాచుకుంటున్న 12 శాతానికి అదనంగా మూలవేతనంలో ఎంతైనా చేసుకోవచ్చు. వడ్డీ రేటూ ఈపీఎఫ్‌కు ఉన్నట్టే ఉంటుంది. అంటే ప్రస్తుతం 8.5 శాతం అన్నమాట.
జీపీఎఫ్ (GPF)
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే జనరల్ ప్రావిడెంట్ ఫండ్‌లో డబ్బులు దాచుకోవచ్చు.
మూల వేతనం నుంచి 12శాతం ఈపీఎఫ్ జమ చేసిన తర్వాత అదనంగా దాచుకోవాలంటే జీపీఎఫ్ తెరవొచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ అందరికీ ఇది వర్తించదు.