పన్నుల సమగ్ర సమాచారం తెలుసుకొనేలా పన్ను చెల్లింపు దారులకు సాయం చేసేందుకు ఐటీ శాఖ ముందుకొచ్చింది.



సరికొత్తగా వార్షిక సమాచార పత్రం (యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌) తీసుకొచ్చింది



వడ్డీ, డివిడెండ్‌, సెక్యూరిటీ లావాదేవాలు, మ్యూచువల్‌ ఫండ్ల లావాదేవీలు, విదేశాల నుంచి వచ్చిన ఆదాయం వివరాలను ఇందులో చూడొచ్చు.



ఏఐఎస్‌ స్టేట్‌మెంట్లో సరళీకరించిన టాక్స్‌పేయర్‌ ఇన్ఫర్మేషన్‌ సమ్మరీ ఉంటుంది.



ఏఐఎస్‌ స్టేట్‌మెంట్‌ పూర్తిగా అమల్లోకి వచ్చేవరకు ఫామ్‌26 ఏఎస్‌ కూడా TRACES పోర్టల్లో అందుబాటులో ఉంటుంది.

మీ పాన్‌ లేదా ఆధార్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ ఉపయోగించి

https://eportal.incometax.gov.in/iec/foservices/#/loginకి లాగిన్‌ అవ్వాలి



టాప్‌మెనూలో సర్వీసెస్‌ సెక్షన్‌కు వెళ్లి యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌ను క్లిక్‌ చేయాలి



ఆ తర్వాత ప్రొసీడ్‌పై క్లిక్‌ చేయాలి. ఏఐఎస్‌ ట్యాబ్‌పై డౌన్‌లోడ్‌ బటన్‌ను క్లిక్‌ చేయాలి. పీడీఎఫ్‌ లేదా జేఎస్‌ఓఎన్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేసి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఏఐఎస్‌ ఫామ్‌కు పాస్‌వర్డ్‌ ఉంటుంది. అది మీ పాన్‌, పుట్టినతేదీతో ఉంటుంది. ఉదాహరణకు మీ పాన్‌ ABCDE1234F, పుట్టినతేదీ 01-01-1978 అయితే మీ పాస్‌వర్డ్‌ ABCDE1234F01011978 అవుతుంది.

పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయగానే ఏఐఎస్‌ ఫామ్‌లోని వివరాలన్నీ కనిపిస్తాయి. మీ సమాచారంపై ఎలాంటి ఇబ్బందులు, అనుమానాలు ఉన్నా ఆన్‌లైన్‌లో వెంటనే ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వొచ్చు.