అందాల బుట్ట బొమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. రష్మిక తర్వాత టాలీవుడ్, బాలీవుడ్‌లో బిజీగా ఉన్న తార ఈమే. ప్రస్తుతం వరుస ఫ్లాప్‌లు పూజాను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ‘రాధేశ్యామ్’, ‘బీస్ట్’, ‘ఆచార్య’ సినిమాల్లో పూజా హీరోయిన్‌గా నటించింది. ఆ మూడు చిత్రాల్లో ‘రాధేశ్యామ్’ ఒక్కటే కాస్త మెప్పించింది. పూజా కూడా ఆకట్టుకుంది. కేన్స్‌లో తొలిసారి రెడ్ కార్పెట్‌పై నడిచే అవకాశం పూజాకు లభించింది. పూజా తాజాగా మాల్దీవుల ట్రిప్‌కు సంబంధించిన పాత ఫొటోలను షేర్ చేసింది. బీచ్‌లో స్పూన్‌తో షర్బత్ తింటున్న ఫొటోలను పోస్ట్ చేసింది. దీంతో అభిమానులు.. అంతా నువ్వే తినేస్తావా? అని అంటున్నారు. Images Credit: Pooja Hegde/Instagram