బుల్లితెర బ్యూటీ క్వీన్ అనసూయకు ఇటీవలే పుట్టిన రోజు జరుపుకుంది. తాజాగా ఆమె తన పెళ్లి రోజు కూడా చేసుకుంది. అనసూయకు పెళ్లై అప్పుడే 12 ఏళ్లు అయిపోయాయట! సుశాంక్‌తో తనది 21 ఏళ్ల బంధమని అనసూయ ఇన్‌స్టా వేదికగా తెలిపింది. అన్నేళ్లయినా తమ ప్రేమ రెట్టింపు అయ్యిందేగానీ, తరగలేదని అనసూయ పేర్కొంది. పెళ్లి రోజు సందర్భంగా సుశాంక్, అను బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. అంతేకాదు, అనసూయ అప్యాయంగా తన భర్త అదరాలను అందుకుంది. ఆ లిప్ లాక్ వీడియోను అనసూయ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది ఈ వీడియో చూసి కొందరు ముక్కున వేలు వేసుకుంటున్నారు. కానీ, అభిమానులు మాత్రం ఈ బంధం నిండు నూరేళ్లు చక్కగా ఉండాలని కోరుకుంటున్నారు. Images and Videos Credit: Anasuya Bhardwaj/Instagram