శ్రియా 2018లో రష్యాకు చెందిన ఆండ్రూ కొస్చీవ్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. విదేశాల్లో సెటిలైపోయిన శ్రియా ఇక సినిమాలు చేయదని అంతా భావించారు. తనకు పాప పుట్టేవరకు శ్రియా కొన్నాళ్లు బయట ప్రపంచానికి కనిపించలేదు. శ్రియా ఇటీవలే తన కూతురు రాధాను ప్రపంచానికి పరిచయం చేసింది. ఇటీవల RRRలో కీలక పాత్రలో కనిపించింది శ్రియా. తాజాగా ఆరు గజాల చీరలో అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది శ్రియ. ఆ ఫొటోలు చూసి.. నటి భూమిక కూడా ఫిదా అయ్యింది. భూమిక.. ఆ ఫొటోలకు ‘బ్యూటిఫుల్’ అని కామెంట్ చేసింది. అభిమానులు కూడా నిన్ను బాగా మిస్సవ్వుతున్నాం శ్రీయా అని అంటున్నారు. Image Credit: Sriya Saran/Instagram