మేషం ఎవరితోనైనా వివాదం కారణంగా మీ దినచర్యకు ఆటంకం ఏర్పడుతుంది. భవిష్యత్ ప్రణాళికలు వేసుకునేందుకు మంచిరోజు.ఏదో టెన్షన్లో ఉంటారు. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు. కార్యాలయానికి సంబంధించిన ముఖ్యమైన పని పూర్తిచేయగలుగుతారు.
వృషభం ఆర్థిక పరిస్థితి బావుంటుంది. గతంలో ఉన్న ఒత్తిడి తొలగిపోతుంది. ఈ రోజు మీకు మంచి రోజు అని నిరూపితం అవుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆసక్తికి అనుగుణంగా పనిచేయడం వల్ల ఆనందం పొందుతారు.
మిథునం ఈ రోజంతా గందరగోళంగా ఉంటుంది. ఇతరుల సలహా కాకుండా మీ మనసు చెప్పింది వినండి. అవసరమైన పనిని వీలైనంత త్వరగా పూర్తి చేయండి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. మీ నిర్ణయాలు తప్పు కావొచ్చు. ఏదో విషయంలో పశ్చాత్తాపపడతారు.
కర్కాటకం బంధువులను కలుస్తారు. మీ వ్యాపార ప్రణాళికల గురించి చాలా ఉత్సాహంగా ఉంటారు. అప్పుతీసుకున్న మొత్తాన్ని సక్రమంగా వినియోగిస్తారు. ఒకరి పురోగతిని చూసి అసూయపడతారు. ధనానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి.
సింహం ఉద్యోగులు ఉన్నతాధికారిని తిట్టుకుంటారు. మీ పనిని సకాలంలో పూర్తిచేసేందుకు ప్రణాళికలు వేసుకోండి. ఎవరైనా మీ పట్ల తప్పుడు ఆలోచనలు కలిగి ఉన్నా మీరు పట్టించుకోవద్దు. డబ్బు పెట్టేముందు అన్నీ జాగ్రత్తగా పరిశీలించండి.
కన్యా విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి. ధన లాభం పొందుతారు. పెద్దల అభిప్రాయాలను గౌరవించండి. మీరు శ్రమకు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు శుభసమయం.
తులా ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. మీ ప్రియమైన వారిని కలవడం ఆనందంగా ఉంటుంది. టెన్షన్ తగ్గుతుంది.ప్రైవేట్ ఆఫీసులో పని చేసే వారు ఉత్సాహంగా ఉంటారు. బంధువుల నుంచి మంచి సమాచారం అందుతుంది.
వృశ్చికం మీకు ఈ రోజు చాలా మంచిరోజు. మునుపటి పెట్టుబడి నుంచి లాభం పొందుతారు. చెడు సంబంధాలను సరిదిద్దడంలో మీరు విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలొస్తాయి. మీ బాధ్యతను నిర్వర్తించడం గురించి మీరు ఆందోళన చెందుతారు.
ధనుస్సు కార్యాలయానికి సంబంధించిన పనులపై ప్రయాణం చేయాల్సి రావొచ్చు. కొత్త బాధ్యతలు పెరుగుతాయి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. సహోద్యోగులు మీపై కోపంగా ఉంటారు. మానసిక ఆందోళన ఎదుర్కొంటారు.
మకరం ఇంటా బయటా మీ ప్రతిష్ట పెరుగుతుంది. ముందుగా నిర్ణయించిన పనులను పూర్తి చేయగలుగుతారు. కొన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ అన్ని పనుల్లో విజయం సాధిస్తారు.ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు పూర్తిచేస్తారు. ఆర్థికంగా మీదే పైచేయి.
కుంభం ఈ రోజు మీకు మంచి రోజు. పిల్లల కదలికలపై నిఘా ఉంచండి. ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మీ పనితీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. మీ పనిని ఇతరులకు అప్పగించవద్దు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆహారం పట్ల నిర్లక్ష్యం వద్దు.
మీనం వ్యాపారంలో మంచి ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు. అవసరమైన వారికి సహాయం చేసిన తర్వాత సంతోషంగా ఉంటారు. మీరు పిల్లల గురించి గర్వపడతారు. మీ అత్యవసర పనుల జాబితాను రూపొందించి దాని ప్రకారం ఫాలో అవండి.
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి