గతేడాది సెప్టెంబర్‌లో రిలీజ్ అయిన ‘పీఎస్ 1’ తమిళనాట ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా సీక్వెల్ ‘పీఎస్ 2’ ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల అయింది. మొదటి భాగం ఎక్కడ ముగిసిందో ఈ పార్ట్ అక్కడే ప్రారంభం అవుతుంది. ‘పీఎస్ 1’ తమిళంలో పెద్ద హిట్ అయినప్పటికీ తెలుగులో మాత్రం యావరేజ్‌గానే ఆడింది. రెండో భాగం మొదటి సన్నివేశం నుంచే కథలోకి వెళ్లిపోయారు దర్శకుడు మణిరత్నం. ఆదిత్య కరికాలుడు, నందినిల చిన్ననాటి ప్రేమ కథ స్క్రీన్‌పై అందంగా కనిపిస్తుంది. సినిమా ఫస్టాఫ్ చాలా రేసీగా సాగుతుంది. కానీ సెకండాఫ్ కొంచెం సహనానికి పరీక్ష పెడుతుంది. యుద్ధ సన్నివేశాల్లో వీఎఫ్ఎక్స్ అంత బాలేదు. ఏబీపీ దేశం రేటింగ్ - 3/5