2014లో తొలిసారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేసేటప్పుడు ఆకుపచ్చ, ఎరుపు రంగు జోధ్‌పురి బంధేజ్ తలపాగా ధరించారు.



2015లో మోదీ పసుపు రంగు తలపాగాను క్రిస్-క్రాస్డ్ లైన్‌లతో ధరించారు. కుర్తా, జాకెట్‌లో పూర్తి భిన్నంగా కనిపించారు



2016లో పింక్, పసుపు రంగులతో టై-డై తలపాగ ఎంచుకున్నారు.



2017లో పసుపు, ఎరుపు రంగు తలపాగా ధరించారు. దానిపై గోల్డ్ కలర్‌ గీతలు ఉన్నాయి. ఆ రోజు లేత గోధుమరంగు హాఫ్ స్లీవ్ బంద్‌గాలా కుర్తా ధరించారు.



2018లో ఎర్రకోటలో ప్రసంగించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కాషాయ తలపాగా ధరించారు.



2019లో రెండోసారి విజయం సాధించిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పసుపు తలపాగా ధరించారు.



2020లో ఎర్రకోట వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ కుంకుమపువ్వు, క్రీమ్ సఫా ధరించారు. పాస్టెల్ షేడ్‌లో హాఫ్ స్లీవ్ కుర్తా పైజామాతో కనిపించారు.



2021లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రటి చారలు, కుంకుమపువ్వు రంగుతో కూడిన పూలు ఉన్న తలపాగాను ధరించారు.



2022లో ప్రధాని నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకం ముద్రించిన తెల్లటి తలపాగా ధరించారు. తెల్లని కుర్తా, చురీదార్‌తో పాటు నీలం రంగు నెహ్రూ కోటుతో కనిపించారు.



2023లో ప్రధాని నరేంద్ర మోదీ పొడవాటి క్లాత్‌తో కూడిన డిఫరెంట్ కలర్డ్‌ రాజస్థానీ తరహా తలపాగా ధరించి, తెల్లటి కుర్తా, తెల్లటి ప్యాంటు, పాకెట్ స్క్వేర్‌తో కూడిన జాకెట్‌ ధరించారు.