ఈ బ్లడ్ గ్రూపున్న వారికి గుండెపోటు వచ్చే ఛాన్స్ అధికం

ఒక కొత్త అధ్యయనం ప్రకారం కొన్ని బ్లడ్ గ్రూపులు కలిగి ఉన్నవారికి గుండె జబ్బుల ప్రమాదం పొంచి ఉంటుంది.

A, B, AB రక్తవర్గాలను కలిగి ఉన్న వారిలో రక్తం గడ్డ కట్టడం, గుండె సంబంధ వ్యాధులు, గుండె పోటు వంటివి వచ్చే అవాకాశం ఎక్కువ.

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం 4,00,000 మందిపై చేసిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది.

ఈ మూడు రక్త వర్గాల్లో O రక్త వర్గంతో పోలిస్తే గుండె పోటు వచ్చే అవకాశం 8 శాతం ఎక్కువ, గుండె ఆగిపోయే ప్రమాదం 10 శాతం ఎక్కువని ఈ అధ్యయనం నిర్ధారించింది.

A, B రక్త రకాలు కలిగిన వ్యక్తుల్లో సిరలలో రక్తం గడ్డకట్టే అవకాశం 51 శాతం అధికంగా ఉంటుంది.

A, B రక్త రకాల్లో పల్మనరీ ఎంబోలిజం అనే సమస్యతో బాధపడే అవకాశం ఎక్కువ.

AB బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు ఇతరులతో పోలిస్తే 23 శాతం అధికంగా గుండె జబ్బులకు గురవుతారని తేలింది.

B బ్లడ్ గ్రూప్ ఉన్న వారు 11 శాతం ఎక్కువ ముప్పుని కలిగి ఉంటారని, A బ్లడ్ గ్రూప్ వ్యక్తులు 5 శాతం ప్రమాదాన్ని కలిగి ఉంటారని తెలిసింది.