మే 11 బుధవారం రాశిఫలాలు



మేషం
ఈ రోజు మంచి రోజు అవుతుంది. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు ఉన్నత స్థానాలను పొందుతారు. అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తవుతాయి. పిల్లల విజయాలతో మీ మనసు ఆనందంగా ఉంటుంది. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి.



వృషభం
ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. గందరగోళ స్థితిలో ఉంటారు. వ్యాపారంలో పెద్ద రిస్క్ తీసుకోకుండా ఉండాలి. పై అధికారులకు మీపై ఉన్న మంచి అభిప్రాయాన్ని పాడుచేసుకోకండి.



మిథునం
మీరు సామాజికంగా గౌరవాన్ని అందుకుంటారు. వృత్తిలో చికాకులు దూరమవుతాయి.వ్యాపారం పెరుగుతుంది. మీరు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధార్మిక కార్యక్రమాల పట్ల అధిక ఆసక్తి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే క్షీణిస్తున్న మీ సంబంధం మెరుగుపడుతుంది.



కర్కాటకం
మీరు మీ బాధ్యతను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీ ప్రతిష్ట పెరుగుతుంది. మీ పని తీరుతో ప్రశంసలు అందుకుంటారు. శుభ కార్యాల్లో డబ్బు ఖర్చు చేస్తారు. మీ ఆలోచనను ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంచుకోండి.



సింహం
శుభవార్త వింటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ కోరికలు ఏవైనా నెరవేరుతాయి. వైవాహిక జీవితంలో ప్రేమను ఆనందిస్తారు. పెద్ద కంపెనీలో చేరడానికి లేదా భాగస్వామిగా ఉండేందుకు అవకాశం ఉండొచ్చు. పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది.



కన్యా
కుటుంబ సభ్యుల సహకారంతో మీ పనులు పురోగమిస్తాయి. కోపం తగ్గించుకోండి, ఇతరుల కోపానికి గురవకండి. ఇంట్లో ఒకరి ఆరోగ్యం గురించి ఆందోళ ఉంటుంది. ఆర్థిక సమస్యలు ఉండొచ్చు. లావాదేవీలు జాగ్రత్తగా చేయాలి.



తుల
జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ముఖ్యమైన వ్యాపార పర్యటన ఉండొచ్చు. విద్యార్థులు తమ చదువుల గురించి ఆందోళన చెందుతారు. మీ దినచర్య చాలా క్రమబద్ధంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందవచ్చు.



వృశ్చికం
మీరు పెండింగ్‌లో ఉన్న పనులు సులభంగా పూర్తి చేస్తారు. మీ పొరుగువారితో సత్సంబంధాలు కలిగి ఉండాలి. వ్యాపారంలో ఆశించిన ఫలితాలను పొందుతారు. మీ పనిలో నాణ్యత పెరుగుతుంది. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది.



ధనుస్సు
ఈరోజు అద్భుతంగా ఉంటుంది. స్నేహితులకు తగినంత సమయం ఇవ్వండి. వ్యాపారులకు ఈ రోజు చాలా మంచిది. యువత అభివృద్ధి చెందేందుకు అవకాశాలు లభిస్తాయి. మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు పూర్తి విశ్వాసంతో పని చేస్తారు.



మకరం
ఈ రోజంతా గందరగోళంలో ఉంటారు.ప్రేమికులు మధ్య సామరస్యం ఉండదు. కుటుంబ సభ్యుల్లో ఒకరి గురుంచి చెడుగా ఆలోచిస్తారు. తెలివైన వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పాదాల మంట సమస్యతో బాధపడతారు.



కుంభం
అదృష్టం మీకు కలిసొస్తుంది. ప్రత్యర్థులు మీకు అనుకూలంగా మారతారు. ఆర్థిక పరంగా ఈ రోజు చాలా మంచిది. విద్యార్థులు కొన్ని ప్రత్యేక విజయాలు పొందుతారు. భాగస్వామ్య పని ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది.



మీనం
మిమ్మల్ని ఉపయోగించుకునేవారిని దూరంగా ఉంచండి. మీ సహోద్యోగుల చెడు అలవాట్లను గమనించండి. కొత్త వ్యాపారాల్లో కొంత గందరగోళం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.