కొన్ని సినిమాలు థియేటర్లలో బ్యాన్ అయినా కూడా ఓటీటీలో మాత్రం అందుబాటులో ఉన్నాయి. ది డా విన్సి కోడ్ (The Da Vinci Code) - చైనాలో బ్యాన్ అయిన ఈ సినిమా ఇండియాలో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఇంగ్లీష్‌లోనే అత్యంత బోల్డ్ సినిమాగా ముద్ర వేసుకున్న ‘50 షేడ్స్ ఆఫ్ గ్రే’ నెట్‌ఫ్లిక్స్, జియో సినిమాలో స్ట్రీమ్ అవుతోంది. 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లపై తెరకెక్కిన ‘ఫిరాక్’.. అక్కడ బ్యాన్ అయినా జీ5, యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. సింగపూర్‌లో బ్యాన్ అయిన పొలిటికల్ డ్రామా థ్రిల్లర్ ‘జూల్యాండర్’ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. అసభ్యకరంగా ఉందంటూ ‘ది పింక్ మిర్రర్’ అనే చిత్రం బ్యాన్ అయినా కూడా ఇప్పటికీ ఎమ్ఎక్స్ ప్లేయర్‌లో స్ట్రీమ్ అవుతూనే ఉంది. హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉన్న ‘ది సింప్సన్స్’ అనే యానిమేషన్ చిత్రాన్ని మైన్మార్ బ్యాన్ చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో ఉన్న ‘అము’ అనే హిందీ చిత్రం కూడా గుజరాత్ అల్లర్లపై తెరకెక్కించారనే కారణంతో సెన్సార్ చాలా కట్స్ చేసింది.