పంచ పాత్ర అంటే ఒక పాత్ర కాదు. ఆరాధనకు అయిదు పాత్రల్లో శుద్ధోదకం ఉండాలి



చాలామంది ఒక పాత్రలోనే అన్నీ ఉంచి మమ అనేస్తున్నారు



1అర్ఘ్య పాత్ర: భగవంతుని చేతులు కడిగేందుకు సమర్పించే శుద్ధ జలాలతో కూడిన పాత్ర



2. పాద్య పాత్ర: ఇది భగవంతునికి పాదాలు శుభ్రపరిచేందుకు సమర్పించేందుకు శుద్ధ జలాల పాత్ర



3. ఆచమనీయ పాత్ర: కేశవ నామాలు చెప్పి ఆచమనీయం చేయడానికి శుద్ధోదకం నింపిన పాత్ర



4. స్నాన పాత్ర: భగవంతునికి స్నానం చేయించడానికి కావలసిన శుద్ధోదకం నింపుకున్న పాత్ర



5. శుద్ధోదక పాత్ర- ఇందులో భగవంతుని కి సమర్పించే జలాలు నింపుకున్న పాత్ర



ఈ పంచపాత్రలు కాకుండా ఉపచారాలు చేసిన తర్వాత తీసిన నిర్మాల్యపు జలాలు నింపుకునే పాత్ర ఉండాలి



ఆచార్య పూజ కూడా ఉండే వాళ్లకు ఆచార్యునికి అర్ఘ్య సమర్పణకు ఒక పాత్ర ఉండాలి



సర్వార్థ జల పాత్ర- ఇది ప్రతీ ఉపచారానికి మధ్య మధ్యలో ఉద్ధరిణ శుభ్రం చేసుకునేందుకు శుద్ధ జలం నింపిన పాత్ర