కత్రినా చేతికి పెట్టే మెహెందీ ఖరీదు రూ. లక్ష? కత్రినా - విక్కీ కౌశల్ పెళ్ళి డిసెంబర్ 9న జరగబోతోందంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తలను కత్రినా - విక్కీ కూడా ఖండించలేదు. వీరి పెళ్లి మూడు రోజుల పాటూ రాజస్థాన్ లోని ఓ రిసార్టులో జరుగుతుందని వినికిడి. ఇప్పటికే రాజస్థాన్లోని 45 హోటళ్లను అతిథుల కోసం బుక్ చేసేశారట. కత్రినా కైఫ్ తన పెళ్లికి దగ్గరుండి అన్ని డిజైన్ చేయించుకుందట. పెళ్లి చీర నుంచి మెహెందీ వరకు... అంతా కస్టమైజ్డ్. మెహెందీ వేడుకను ధూమ్ ధామ్ గా చేయబోతున్నారట. అందులోనూ క్రతినా చేతికి పెట్టే మెహెందీ ఖరీదు రూ.లక్ష అని తెలుస్తోంది. చాలా ప్రత్యేక మైన గోరింటాకును తయారుచేయించుకుందట కత్రినా. దీన్ని సోజత్ మెహెందీ అని పిలుస్తారు. రాజస్థాన్ లోని పాలి జిల్లాలో ఈ మెహెందీని ప్రత్యేకంగా తయారుచేస్తారు. దీన్ని పూర్తిగా సేంద్రియ పద్ధతిలో తయారుచేస్తారు. ఎలాంటి రసాయనాలు కలపరు. ఐశ్యర్యరాయ్, ప్రియాంక చోప్రా కూడా తమ పెళ్లిళ్లకు ఈ మెహెందీనే పెట్టుకున్నారు