హర్రర్ సినిమాలంటే.. కల్పిత కథలనే భావన ఉంది. అయితే, కొన్ని సినిమాలను పలు వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఆ చిత్రాలను చూస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం.
The Exorcist (1973): 1949లో రోనాల్డ్ డాయ్ అనే బాలుడి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసినవారు.. నాటి భయానక ఘటనను ఓ పుస్తకంలో రాశారు. దాని ఆధారంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
The Entity (1982): దెయ్యాలు అత్యాచారాలు కూడా చేస్తాయంటే నమ్ముతారా?1974లో కాలిఫోర్నియాలోని కల్వెర్ సిటీకి చెందిన ఓ మహిళపై మూడు ఆత్మలు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు.
The Amityville Horror (2005): 1975లో కాలిఫోర్నియాలోని ఓసియన్ అవెన్యూలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.
The Exorcism Of Emily Rose (2005): 1970లో అన్నెలిసె మైఖెల్ అనే యువతి ఎదుర్కొన్న భయానక అనుభవం ఈ చిత్రం.
Wolf Creek (2005): ఆస్ట్రేలియాలో ఇవెన్ మిలత్, బ్రాడ్లీ జాన్ మార్డోచ్ అనే ఇద్దరు నేరగాళ్ల దారుణ మారణకాండ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.
The Hauntig in Connecticut (2009): 1986లో సౌథింగ్టన్‌లో స్మశానాల్లో అంత్యక్రియలు జరిపే వ్యక్తి ఇంట్లోకి దిగిన ఓ కుటుంబానికి ఎదురయ్యే చేదు ఘటనలే ఈ చిత్రం.
The Rite (2011): అమెరికా భూత వైద్యుడు ఫాదర్ గ్యారీ థోమస్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
The Conjuring (2013): 1971లో ఆత్మలు ఆవహించిన ఓ యువతి ఒరిజినల్ వీడియోను చూసి ఈ చిత్రాన్ని నిర్మించారు. 1993లోనే ఈ చిత్రాన్ని ప్లాన్ చేశారు. కానీ, ఎన్నో అవాంతరాల తర్వాత 2013లో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలైంది.
The ConJuring 2 (2016): 1977లో లండన్‌లో చోటు చేసుకున్న ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
Annabelle 2 (2017): 1970లో డొన్నా అనే యువతికి ఆమె తల్లి బహుమతిగా ఈ బొమ్మ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే, వాస్తవ ఘటనలను యథావిధిగా కాకుండా కొన్ని కల్పిత సీన్లతో చిత్రాన్ని రూపొందించారు.