2023 నవంబరు నెలలో మీ రాశిఫలితం చూసుకున్నారా!



మేషరాశి వారికి నవంబర్ నెలలో మిశ్రమ ఫలితాలున్నాయి. వ్యాపారం , వృత్తిలో అభివృద్ధి. అవివాహితులకు వివాహ సూచన. అష్టమంలో గ్రహ సంచారం కారణంగా ఆందోళనలు . అనవసర వివాదాలు. ప్రయాణాలకు దూరంగా ఉండడమే మంచిది. ఆరోగ్యం గురించి అప్రమత్తంగా ఉండాలి.



వృషభ రాశి వారికి నవంబరు బాగానే ఉంటుంది. ఉద్యోగులకు శుభసమయం. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. మీరు భాగస్వామ్య వ్యాపారం చేయాలి అనుకుంటే సరైన సలహాలు లేకుండా ముందు అడుగు వేయొద్దు. కుటుంబంలో విభేదాలు ఉంటాయి. ఒత్తిడికి లోనవుతారు.



మిథున రాశివారికి అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. మంచి జీతం పొందుతారు. వ్యాపారం బాగా సాగుతుంది. కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈనెలలో చేసే ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. దైవకార్యాల్లో పాల్గొంటారు.



కర్కాటక రాశి వారికి ఈ నెల బాగానే ఉంటుంది. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే సరైన సమయం. వ్యాపారంలో లాభాలుంటాయి. ఆదాయానికి లోటుండదు. వ్యవహార జయం ఉంటుంది. భూ సంబంధిత వ్యవహారాలు కలిసొస్తాయి. వ్యక్తిగత జీవితంలో చిన్న చిన్న సమస్యలు తప్పవు.



సింహ రాశివారికి ఈ నెల గ్రహసంచారం అనుకూలంగా ఉంటుంది. మీరు మీ భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. వ్యాపారంలో లోపాలను వెంటనే సరిదిద్దుకోవాలి. ఉద్యోగంలో ఉన్నవారికి బదిలీలు రావొచ్చు. ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.



నవంబర్ నెల కన్య రాశి వారికి చాలా బాగుంటుంది. ఈ నెలలో మీరు వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ కి సంబంధించిన సమచారం వింటారు. ఆదాయం బావుంటుంది, ఆరోగ్యం బావుంటుంది, వ్యవహార జయం ఉంటుంది.



నవంబర్ మాసం తులారాశి వారికి మిశ్రమ ఫలితాలున్నాయి. ఈ నెలలో మీకు ఆర్థిక సంబంధిత సమస్యలు తీరుతాయి. భాగస్వామ్య వ్యాపారం కలిసొస్తుంది. అవివాహితులకు సంబంధం కుదురుతుంది. వృత్తి, వ్యాపారం, ఉద్యోగంలో బాగానే ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రయోజం పొందలేరు.



జన్మరాశిలో గ్రహసంచారం ఈ రాశివారి ఆరోగ్యంపై దెబ్బకొడుతుంది. ఏదో ఒక అనారోగ్య సమస్య వెంటాడుతుంటుంది. విపరీతమైన ఉద్రేకంతో ఉంటారు. వ్యాపారం, ఉద్యోగంలో మంచి ఫలితాలే సాధిస్తారు. ఆదాయానికి లోటుండదు.



ధనుస్సు రాశి వారికి నవంబర్ ప్రధమార్థం బావుంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలవారికి అనుకూల ఫలితాలున్నాయి. ఆరోగ్యం బావుంటుంది. చిన్న చిన్న ఇబ్బందులుంటాయి కానీ అధిగమిస్తారు. నెల ద్వితీయార్థంలో 12 వస్థానంలో గ్రహసంచారం వల్ల పనుల్లో ఆటంకాలు, ఊహించని ఖర్చులు



నవంబర్ నెల మకరరాశివారికి బావుంటుంది. నిన్న మొన్నటి వరకూ వెంటాడిన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీరు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఆర్థిక సమస్యల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడతారు.



కుంభ రాశి గ్రహాలు అనుకూల ఫలితాలను ఇస్తున్నాయి. త్వరలో గుడ్ న్యూస్ వింటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఏ పనిలోనూ ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు. వ్యవహార జయం ఉంటుంది.



మీనరాశివారికి నవంబరు నెలలో మిశ్రమ ఫలితాలున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. అనుకోని ఆదాయం చేతికందుతుంది. అకాలభోజనం, మనో దుఃఖం, కుటుంబంలో విచారం ఉంటుంది. సంతానం వల్ల ఇబ్బంది పడతారు. ఆరోగ్యం జాగ్రత్త.