గ్రహణ సమయంలో వంట చేయడం, ఆరగించడం రెండూ నిషేధమే.
గ్రహణం ప్రారంభమవడానికి ముందు ఈ రోజు చేసిన వంటను ఖాళీ చేయండి. గ్రహణం ముగిసిన తరువాత, శుభ్రంగా స్నానమాచరించి ఆహారాన్ని సిద్ధం చేసి తినండి.
గ్రహణ సమయంలో పూజ చేయవద్దు. కానీ, మీరు భగవన్నామాన్ని, ఇష్టదేవతా మంత్రాలను జపించవచ్చు.
గ్రహణ సమయంలో, గర్భిణులు ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు
గ్రహణం ముగిసిన తర్వాత ఆహార పదార్థాలలో కలిపిన గరిక లేదా తులసి ఆకులను తీసివేయాలి
గ్రహణం ముగిసిన తర్వాత ఇంట్లో దేవతామూర్తుల విగ్రహాలను కూడా శుభ్రం చేసి గంగాజలం చల్లాలి
గ్రహణం ముగిసిన తర్వాత ఇంటిని శుభ్రం చేయాలి. ఆ తర్వాత ఇంట్లో గంగాజలం చల్లాలి. ఇలా చేయడం వల్ల ప్రతికూలత తొలగిపోతుంది
సూర్యగ్రహణం , చంద్రగ్రహణం ఏదైనా కానీ ముగిసిన తర్వాత ఇంటి సభ్యులందరూ స్నానం చేయాలి
గ్రహణం తర్వాత దానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. దానం చేయడం వల్ల జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని పండితులు చెబుతారు. Images Credit: Freepik