చంద్ర గ్రహణం: దర్భలకి అంత పవర్ ఉందా!



అక్టోబర్ 28 అర్దరాత్రి చంద్రగ్రహణం సంభవించబోతోంది. అర్ధరాత్రి 01:04 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 02:23 గంటలకు ముగుస్తుంది.



గ్రహణ సమయంలో ఆహార పదార్థాలపై దర్భలు వేయడం గమనించే ఉంటారు. ఇంతకీ దర్భలు ఎందుకు వేయాలి, దర్భలకు ఆహార పదార్థాలకు ఏంటి సంబంధం.



గ్రహణ సమయంలో సూర్యుడు, లేదా చంద్రుడు నుంచి రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాన్ని హరించే శక్తి దర్భలకు ఉంది.



సాధారణంగా గ్రహణాలు ఏర్పడ్డప్పుడు వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఆ మార్పులు మనిషి శరీరంపైన శారీకంగానూ, మానసికంగానూ ప్రభావాన్ని చూపుతాయి.



జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 'ఆరోగ్యం భాస్కరాదిత్యేత్' అన్నట్లుగానే చంద్రుడిని 'మనః కారకుడు'గా చెబుతుంటారు. సూర్య, చంద్రులిద్దరూ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తారు.



గ్రహణ సమయంలో వారి శక్తి తగ్గుతుంది. ఈ సమయంలో అతినీలలోహిత కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.



ముఖ్యంగా తినే పదార్థాలపై దర్భలను ఉంచినట్లయితే ఆ రేడియేషన్ ప్రభావాన్ని తగ్గిస్తాయని శాస్త్రీయ పరిశోధనల్లో రుజువైంది కూడా.



చంద్రగ్రహణం సూతకాలం 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. సూతకాలం ప్రారంభం కాగానే పూజలు ఆగిపోతాయి. ఆలయాల తలుపు మూసేస్తారు.



Images Credit: Freepik