విభిన్న తరహా అవుట్ ఫిట్‌ల్లో మెస్మరైజ్ చేయడంలో నోరా ఫతేహి ముందంజలో ఉంటారు. బాలీవుడ్‌లో ప్రత్యేక గీతాలకు నోరా ఫేమస్. ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో కాలు కదిపి వాటికి క్రేజ్ వచ్చేలా చేశారు. ప్రస్తుతం తెలుగులో కూడా ఒక క్రేజీ ప్రాజెక్టులో నటిస్తున్నారు. వరుణ్ తేజ్ నటిస్తున్న ‘మట్కా’ అనే సినిమాలో నోరా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇది సినిమాలో కీలకమైన పాత్ర అని తెలుస్తోంది. దీంతోపాటు ప్రత్యేక గీతంలో కూడా నర్తించనున్నారు. ‘మట్కా’తో పాటు మరో మూడు సినిమాల్లో నోరా నటిస్తున్నారు.