క్రెడిట్‌ కార్డుకు దరఖాస్తు చేయండి

గతంలో అప్పులు తీసుకోని వారికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు వెనకడతాయి! మీరు సరైన సమయానికి రుణ వాయిదాలు చెల్లిస్తారని వారికి తెలియాలంటే మొదటక్రెడిట్‌ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి.

అన్‌సెక్యూర్డు కార్డు వాడండి

అన్‌ సెక్యూర్డ్‌ క్రెడిట్‌ కార్డు వినియోగం మరో టెక్నిక్‌! అంటే మీ కార్డును కుటుంబ సభ్యులు ఉపయోగించేలా చేయాలి. అప్పుడు క్రెడిట్‌ కార్డు వినియోగం పెరుగుతుంది. ఫలితంగా క్రెడిట్‌ స్కోరు పెంచుకోవచ్చు.

ఎక్కువ కార్డులు వద్దు

ఎక్కువ క్రెడిట్‌ కార్డులు వాడటం మీ క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం చూపిస్తుంది. అందుకే మరిన్ని కార్డుల కోసం దరఖాస్తు చేయకుండా ఇప్పటికే మీ వద్ద ఉన్న కార్డును మీ అవసరాలకు ఉపయోగించండి.

తరచూ వినియోగించండి

తరచూ క్రెడిట్ కార్డును వినియోగిస్తేనే క్రెడిట్‌ ఏజెన్సీలు మీ స్కోరును పరిగణనలోకి తీసుకుంటాయి. మంచి రేటింగ్‌ ఇస్తాయి. నెలకు కనీసం ఒక్కసారైనా కార్డును ఉపయోగించండి.

లిమిట్‌ చూసుకోండి

క్రెడిట్‌ లిమిట్‌ ముఖ్యమే. క్రెడిట్‌ బ్యూరోలు దీనినీ పరిశీలిస్తాయి. బ్యాలన్స్‌ టు లిమిట్‌ నిష్పత్తిని చూస్తాయి. క్రెడిట్‌ రేషియోను 30 నుంచి 40 శాతం మధ్య ఉండేలా చూసుకోవాలి.

క్రమం తప్పకుండా చెల్లింపులు చేయండి

క్రెడిట్‌ కార్డు సంస్థలు మీ ఆర్థిక సమాచారాన్ని క్రెడిట్‌ బ్యూరోలకు ఇస్తాయి. ఆలస్యంగా చెల్లింపులు చేస్తే అది మీ క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం చూపిస్తుంది. అలా జరగకుండా క్రమం తప్పకుండా చెల్లింపులు చేయండి.

ఏడాది తర్వాత సెక్యూర్డుకు దరఖాస్తు చేయండి

క్రెడిట్‌ కార్డును ఉపయోగించిన ఆరు నెలల తర్వాత క్రెడిట్‌ రిపోర్టు జనరేట్‌ అవుతుంది. మీకు సెక్యూర్డ్‌ క్రెడిట్‌ కార్డు కావాలంటే సంవత్సరం పాటు మీ రుణ చరిత్ర బాగుండేలా చూసుకోవాలి.

సుదీర్ఘ కాలం ఈఎంఐలు

మీరెప్పుడైనా రుణం తీసుకుంటే సుదీర్ఘ కాలపరిమితి ఎంచుకుంటే మంచిది. అప్పుడు మీ ఈఎంఐ తక్కువగా ఉంటుంది. సరైన సమయానికి చెల్లింపులు చేయగలరు. క్రమం తప్పకుండా ఈఎంఐలు చెల్లిస్తుంటే మీ క్రెడిట్‌ స్కోరు పెరుగుతుంది.

నిలకడగా కార్డు వాడండి

రుణ చరిత్రను రాత్రికి రాత్రే సృష్టించలేరు. తరచూ ఉపయోగించడం, సరైన పద్ధతిలో డబ్బు వాడుకోవడం, ఏడాదికి ఆర్నెల్లు కనీసం వాడితే క్రెడిట్‌ స్కోరు పెరుగుతుంది. కొన్నిసార్లు ఎక్కువ సమయమే పట్టొచ్చు.



ఈ తొమ్మిది అంశాలను పరిగణనలోకి తీసుకుంటే క్రెడిట్‌ స్కోర్‌ పెంచుకోవడం తేలికే.