రష్మీ 2002లో హోలీ అనే సినిమాతో సినీరంగంలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చిన్నా చితకా పాత్రల్లో కనిపించినా ఆశించిన బ్రేక్ రాలేదు. దీంతో టీవీరంగంవైపు అడుగులు వేసింది. 2007లో మాటీవీలో వచ్చిన యువ సీరియల్ ద్వారా టీవీ రంగంలోకి అడుగుపెట్టింది. ఈటీవీలో ఐడియా సూపర్ అనే రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా కూడా కనిపించింది. 2013లో జబర్దస్త్ యాంకర్‌గా చేయడం తన కెరీర్‌లో తొలి బ్రేక్. ఆ తర్వాత ఢీలో టీం లీడర్‌గా కూడా చేయడం ప్రారంభించింది. 2016లో గుంటూర్ టాకీస్‌లో చేసిన సువర్ణ పాత్రకు మంచి స్పందన వచ్చింది. అప్పుడప్పుడు వేరే చానెళ్ల షోల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం తెలుగులో టాప్ టీవీ సెలబ్రిటీల్లో రష్మీ కూడా ఒకరు.