కేఎల్‌ రాహుల్‌ తన ప్రేమ గురించి చెప్పేశాడు! అతియా శెట్టిని ప్రేమిస్తున్నట్టు మెసేజ్ చేశాడు

నవంబర్‌ 5 అతియాశెట్టి పుట్టినరోజు. 'హ్యాపీ బర్త్‌డే మై లవ్‌ (ఎమోజీ) అతియా శెట్టి' అని సోషల్‌ మీడియాలో కామెంట్‌ పెట్టాడు

అతియా తండ్రి సునీల్‌ శెట్టి, సోదరుడు అహన్‌ శెట్టి హార్ట్‌ ఎమోజీలతో స్పందించారు

అనుష్క శర్మ, సయామీ ఖేర్, సానియా మీర్జా, సికందర్‌ ఖేర్‌,రితికా, మన్‌దీప్‌ సింగ్‌ విషెస్ చెప్పారు

ప్రస్తుతం అతియాశెట్టి దుబాయ్‌లోనే ఉంది. తన భాగస్వామిగా అతియా పేరును రాహుల్‌ బీసీసీఐ వద్ద నమోదు చేయించాడని ఆలస్యంగా తెలిసింది

స్కాట్లాండ్‌పై కేఎల్‌ రాహుల్‌ బౌండరీలు, సిక్సర్ల వరద పారించేటప్పుడు స్టాండ్స్‌లో అతియా ఎగిరి గంతులేసింది.

అతియా, రాహుల్‌ కలిసి చాలా చోట్లకు వెళ్లారు. ఎన్నో పార్టీలకు అటెండ్‌ అయ్యారు. కానీ అధికారికంగా మాత్రం చెప్పేవాళ్లు కాదు.

కొన్ని ఇంటర్వ్యూల్లో రాహుల్‌ను ఎవరినైనా ప్రేమించారా అని అడిగితే క్రికెట్‌తోనే ప్రేమలో పడ్డా అనేవాడు.

చాలా సందర్భాల్లో అతియా శెట్టి.. రాహుల్‌తో కలిసిన చిత్రాలను ఇన్‌స్టాలో పెట్టేది. అందులో వారిద్దరూ ఎంతో చనువుగా కనిపించేవారు.

తాజాగా తెలిసిన విషయం ఏంటంటే వారిద్దరూ ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ కోసం మాంచెస్టర్లోనే ఉన్నారట.