చైనాలో అపార్టుమెంట్ మధ్య నుంచి మెట్రో వెళ్తుందని రీల్స్ లో చూసి ఔరా అనుకుని ఉంటాం.



ఇప్పుడు మన దేశంలోనూ అలాంటి విచిత్రం అనుకోకుండా జరిగింది.



నాగపూర్ లో ఓ ఫ్లైఓవర్ ను నిర్మించేశారు. ఆ ఫ్లైఓవర్ ఇంటి బాల్కనీలో నుంచి వెళ్తోంది.



అది అక్రమ కట్టడం అని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. కానీ కాదని ఇంటి యజమానులు అంటున్నారు.



తమ ఇంట్లో నుంచి ఫ్లైఓవర్ వెళ్లడంపై వారికేమీ అభ్యంతరాల్లేవు ! . అభ్యంతరం వ్యక్తం చేస్తే ఇల్లు కూల్చేస్తారని భయం.



ఆ ఇంటి కూల్చివేతతో పని లేకుండా కాంట్రాక్టర్ తన పని తాను చేసుకెళ్లిపోయారు.



ఇప్పుడీ ఫ్లైఓవర్ హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



ఆ ఇంటి బాల్కనీ నుంచి వాహనాలు వెళ్తూ ఉంటే.. ఎలా ఉంటుంది ? ప్రారంభించిన తర్వాత వారికే తెలియాలి !



చైనా ప్లాన్ చేసి అద్భుతాలు కడుతూంటే.. మన దగ్గర యాధృచ్చికంగా ఇలాంటివి జరిగిపోతూ ఉంటాయి.